Wednesday 15 April 2015

గ్యాస్ట్రిక్(Gastric)

మొదటి విధానం:
కావలిసిన పదార్ధాలు: 1. కరక్కాయ పొడి 10 గ్రా  2. తానికాయ పొడి 10 గ్రా  3. ఉసిరికాయ పొడి10 గ్రా
 4. సునాముఖి ఆకు పొడి 30 గ్రా  5. నల్ల ఉప్పు 30 గ్రా
పైన చెప్పిన పొడులన్నిటిని కలిపి కొంచెం నిమ్మరసంతొ బాగా నూరాలి. ఇలా నూరిన మిశ్రమాన్నిచిన్న చిన్నగోళీలుగా (3 గ్రా) చేసి గాలికి ఆరబెట్టి గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకోవాలి. వీటిని మార్నింగ్, ఆఫ్టర్ నూన్, ఈవెనింగ్ ఒక్కొకటి  లేదా గ్యాస్ ఎక్కువగా వుంటే రెండు గోలీలు చొప్పున ఆహరం తిన్న తరువాత వేసుకోవాలి. చిన్న పిల్లలకు 1 గ్రా సైజు గోలీలు సరిపోతాయి.

రెండొవ విధానం:
కావలిసిన పదార్ధాలు: వాము(Ajowan) 100 గ్రా, పటికబెల్లం(Rock Candy) 100 గ్రా, ఆవు నెయ్యి (Cow Ghee).
ఆవు నెయ్యిని వేడి చేసి అందులో వాము, పటికబెల్లంల మిశ్రమాన్నికొంచెం కొంచెంగ వేస్తూ కలుపుతుండాలి. ఈ లేహ్యమును  కాసేపు గాలిలో ఉంచితే గట్టిగా తయారవుతుంది. దీనిని ఒక గాజు సీసాలో స్టోర్చేసుకొని ఆహరం తిన్నతర్వాత గాని తినుటకు ముందుగాని 10 గ్రా మోతాదులో వేసుకోవాలి.

No comments:

Post a Comment